వయసు 40 ఏళ్లు.. సీరియల్లో తల్లిగా.. బయట సెగలు రేపేలా..
Rajitha Chanti
Pic credit - Instagram
పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా.. ? బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన నటి. సీరియల్లో తల్లి పాత్రలు పోషించి జనాలకు దగ్గరయ్యింది.
ఆమె పేరు జ్యోతిరాయ్. అదేనండి గుప్పెడంత మనసు సీరియల్లో జగతి మేడమ్ పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. ఈ పాత్రకు ఫాలోయింగ్ ఎక్కువే.
నాలుగు పదుల వయసులోనూ ఏమాత్రం తరగని అందం, గ్లామర్ తో సంచలనం సృష్టిస్తుంది. సీరియల్లో చీరకట్టుతో కనిపించే ఆమె ఇప్పుడు ఇలా కనిపిస్తుంది.
సీరియల్లో పద్దతిగా కనిపించే జ్యోతిరాయ్ గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో మాత్రం హద్దుల్లేకుండా రెచ్చిపోతోంది. తాజాగా ఈ బ్యూటీ ఫోటోస్ వైరలవుతున్నాయి.
1985 ఫిబ్రవరి 23న కర్ణాటకలో జన్మించిన జ్యోతిరాయ్.. కన్నడలో స్టేషన్ 3, సిల్లీ లిల్లీ, శుభమాంగళ్య, కిన్నెర, జోగుల, జోజో లాలీ సినిమాల్లో హీరోయిన్ గా చేసింది.
ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో బుల్లితెరపైకి షిఫ్ట్ అయ్యింది. కన్నడతోపాటు తుళు సీరియల్స్ చేసింది. కన్యదానం సీరియల్ ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది.
కానీ గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఎక్కువగా పాపులర్ అయ్యింది. ఇందులో రిషి తల్లి పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. పద్మనాభ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.
వీరికి బాబు ఉన్నాడు. కానీ భర్తతో విడాకులు తీసుకున్న ఆమె డైరెక్టర్ పుర్వాజ్ ను వివాహం చేసుకున్నట్లు టాక్. ఇప్పుడు హీరోయిన్ గా పలు సినిమాల్లో నటిస్తుుంది.