23 October 2025

సీరియల్లో తల్లిగా.. నెట్టింట ఇలా.. అందాలతో గత్తరలేపుతున్న నటి..

Rajitha Chanti

Pic credit - Instagram

సీరియల్ తారలకు ఫ్యామిలీ ప్రేక్షకులలో ఎంతటి క్రేజ్ ఉంటుందో చెప్పక్కర్లేదు. చీరకట్టులో ఎంతో హుందాగా కనిపిస్తూ తమ అద్భుతమైన నటనతో జనాలకు దగ్గరవుతుంటారు.

అలా ఒక సీరియల్ ద్వారా తెలుగు సినీప్రియుల హృదయాల్లో చోటు సంపాదించుకుంది. కానీ ఇప్పుడు నెట్టింట గ్లామర్ ఫోటోషూట్లతో అందాలతో గత్తరలేపుతోంది ఈ వయ్యారి.

ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. తనే గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతిరాయ్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన గ్లామర్ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. 

గుప్పెడంత మనసు సీరియల్లో జగతి మేడమ్ పాత్రలో నటించింది. ఈ సీరియల్లో చీరకట్టులో ఎంతో హుందగా కనిపిస్తూ తన సహజ నటనతో కట్టిపడేసింది ఈ భామ.

అయితే ఈ సినిమా నుంచి తప్పుకున్న తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. బరువు తగ్గి సన్నజాజీ తీగల మారిపోయింది. అంతేకాకుండా గ్లామర్ హద్దులు చెరిపేసింది జ్యోతి. 

అటు సినిమాలు, ఇటు వెబ్ సిరీస్ లతో సిల్వర్ స్క్రీన్ పై అదరగొట్టేస్తుంది. మరోవైపు గ్లామర్ ఫోజులతో ఫోటోస్ షేర్ చేస్తూ సోషల్ మీడియాలో హీటెక్కిస్తుంది జ్యోతిరాయ్.

ప్రస్తుతం కిల్లర్ అనే సినిమాలో నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ చూస్తుంటే.. ఇందులో గ్లామర్ బ్యూటీగా కనిపిస్తూనే యాక్షన్ హీరోయిన్ గా సత్తా చాటనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు సోషల్ మీడియాలో గ్లామర్ డ్రెస్సులతో రచ్చ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతుండగా.. నెటిజన్స్ క్రేజీగా రియాక్ట్ అవుతున్నారు.