గుంటూరు కారం నుంచి క్రేజీ అప్డేట్.. 'కంగువ' అవాక్కయ్యే న్యూస్..

22 November 2023

మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న సినిమా గుంటూరు కారం. త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి ఇంకో మూడు పాటలు విడుదలకున్నాయి.

వాటిలో ఓ పాటను వచ్చే వారం విడుదల చేస్తామని అన్నారు నిర్మాత నాగవంశీ. గుంటూరు కారం పాటలు మళ్లీ మళ్లీ పాడుకునేలా ఉంటాయని చెప్పారు.

వైష్ణవ్‌తేజ్‌, శ్రీలీల జంటగా నటిస్తున్న సినిమా ఆదికేశవ. ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ వేడుక హైదరాబాద్‌లో జరిగింది.

పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది ఆదికేశవ. కథ వినగానే వైష్ణవ్‌ తేజ్‌కి పక్కాగా సూట్‌ అవుతుందని అనుకున్నట్టు తెలిపారు నాగవంశీ.

సూర్య హీరోగా నటిస్తున్న సినిమా కంగువ. ఈ చిత్రాన్ని 38 భాషల్లో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలిపారు నిర్మాత జ్ఞానవేల్‌ రాజా.

పీరియాడిక్‌ డ్రామాగా తెరకెక్కుతోంది కంగువ. ఐమ్యాక్స్, త్రీడీ వెర్షన్లలోనూ సిద్ధం చేస్తున్నారు. ఇండియన్‌ సినిమా స్థాయిని పెంచే సినిమా అని అన్నారు మేకర్స్.

రాజా రవీంద్ర కీలక పాత్రలో నటించిన సినిమా సారంగదరియా. యంగ్‌ హీరో రాజ్‌తరుణ్‌ చేతుల మీదిగా సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ విడుదలయ్యాయి.

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్‌ ఈ నెల 23 నుంచి మారేడుమిల్లిలో జరగనుంది.