యాక్షన్ మోడ్ లో గుంటూరు కారం.. ధూతగా వచ్చేస్తున్నా నాగచైతన్య..
14 November 2023
గుంటూరు కారం యూనిట్‌తో జాయిన్ అయ్యారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని నానక్‌రామ్ గూడలో జరుగుతోంది.
ఫైట్ మాస్టర్లు అన్బు అరివి పర్యవేక్షణలో భారీ యాక్షన్ సీన్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ స్టార్ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ ఈ రోజు నుంచి బ్యాంకాక్‌లో ప్రారంభం కానుంది.
అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య లీడ్ రోల్‌లో నటించిన వెబ్ సిరీస్ ధూత. చాలా రోజుల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ షో, త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
డిసెంబర్ 1న ధూత స్ట్రీమింగ్‌కు ముహూర్తం ఫిక్స్ చేసింది యూనిట్. మనం ఫేం విక్రమ్ కే కుమార్ ఈ షోకు దర్శకత్వం వహించారు.
లియో సక్సెస్ తరువాత ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా నెక్ట్స్ మూవీ వర్క్ మొదలు పెట్టారు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్.
వెంకట్ ప్రభుతో మూవీ థాయిలాండ్ షెడ్యూల్ పూర్తయ్యింది. ఇప్పటికే చెన్నై చేరుకున్న చిత్రయూనిట్ వచ్చే వారం నెక్ట్స్ షెడ్యూల్‌ను స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది.
సామ్ మానిక్‌షా జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సామ్ బహదూర్ సినిమా డిసెంబర్ 1న రిలీజ్‌కు రెడీ అవుతుంది. ప్రమోషన్‌లో భాగంగా ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.