భారీ స్థాయిలో గుంటూరు కారం ఈవెంట్.. ఫ్యాన్స్ ఖుషి..

TV9 Telugu

09 January 2024

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా చిత్రం ‘గుంటూరు కారం’.

ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ముందు హైదరాబాద్‌లో ఘనంగా ప్లాన్ చేసారు మూవీ మేకర్స్. కానీ అది కుదర్లేదు.

దింతో చివరి నిమిషంలో హైదరాబాద్ నుంచి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరుకు మార్చేసారు గుంటూరు కారం మేకర్స్.

ఈరోజు (జనవరి 9)న సాయంత్రం 5 గంటల నుంచి గుంటూరులోని నంబూరు ఎక్స్ రోడ్స్‌లో ఈ ఈవెంట్ ఘనంగా జరగబోతుంది.

గుంటూరు కారం ఈవెంట్ కోసం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో మహేష్ అభిమానులు హాజరు కానున్నారు.

గుంటూరు కారం మూవీ ప్రీ రిలీజ్ వేడుక కోసం గుంటూరులో 18 ఎకరాల ఖాళీ స్థలాన్ని వాడుకుంటున్నారు నిర్వాహకులు.

ఈరోజు సాయంత్రం గుంటూరులో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కూడా హాజరుకానున్నారు.

ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇది సంక్రాంతి కానుకగా ఈ శుక్రవారం (జనవరి 12)న ప్రేక్షకుల ముందుకు రానుంది.