థియేటర్స్ ముందు గుంటూరు కారం సందడి..
TV9 Telugu
12 January 2024
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు శ్రీనివాస్ తెరకెక్కించిన సంక్రాంతి పండగ సినిమా గుంటూరు కారం.
ఈ చిత్రం జనవరి 12, 2024న 1 AM నుంచి షోలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దింతో ఒంటిగంటి థియేటర్స్ దగ్గర సందడి మొదలైంది.
ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి జోడిగా యంగ్ బ్యూటీ శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు.
ఈ సినిమాలో ఈశ్వరి రావు, రమ్య కృష్ణన్, రావు రమేష్, ప్రకాష్ రాజు, జగపతిబాబు, సునీల్ వంటి వారు కీలక పాత్రల్లో నటించారు.
దీనిపై మాత్రం భారీ ఉన్న సంగతి తెలిసిందే. ఇంకా రిజల్ట్ తెలియాలి. మరి సంక్రాంతికి హిట్ కొడుతుందో లేదో చూడాలి.
యూఎస్ఏ ప్రీమియర్ లో 1.3 మిలియన్ డాలర్స్ తో భారీ వసూళ్లు సాదించింది ఈ చిత్రం. ఇంకా ఇండియాలో కలెక్షన్స్ తెలియాల్సి ఉంది.
దీని తర్వాత మహేష్ చిత్రం ఏంటో ఇంకా క్లారిటీ లేదు. రాజమౌళితోనే నెక్స్ట్ సినిమా అనే అభిమానులు భావిస్తున్నారు.
అయితే ఈ సినిమా ఎప్పటి నుంచి సెట్స్ పైకి వెళ్లనుందో తెలియాలి. సినిమా అయితే అనౌన్స్ అయింది.. కానీ షూటింగ్ పై ఎలాంటి ప్రకటన రాలేదు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి