కుర్చీ మడతబెట్టి రికార్డు.. జితేందర్ రెడ్డి వస్తున్నాడు..

TV9 Telugu

03 April 2024

గుంటూరు కారం కుర్చీ మడతపెట్టి సాంగ్ సోషల్ మీడియా, యూట్యూబ్‌లో ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇప్పటికే ఇండియాలోని పలు రాష్ట్రాల్లో కాలేజీ ఈవెంట్స్‌లో, జాతర్లలో, పార్టీల్లో ఈ పాటని తెగ వాడేస్తున్నారు.

ఇప్పుడు ఈ పాట సముద్రాలు, ఖండాలు దాటి అమెరికాలోనూ అదరగొడుతుంది. తాజాగా దీనికి సంబంధించి ఓ వీడియో వైరల్ అవుతుంది.

అమెరికాలోని హూస్టన్‌లో నేషనల్ బాస్కెట్ బాల్ గేమ్స్ జరుగుతున్నాయి. అక్కడ బ్రేక్‌లో కుర్చీ మడతబెట్టి పాటను ప్లే చేసి.. డాన్సులు చేసారు.

ముదుగంటి క్రియేషన్స్ బ్యానర్‌‌‌పై డైరెక్టర్ విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా జితేందర్ రెడ్డి.

ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాహుబలి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రే హీరోగా నటిస్తున్నారు.

నిజజీవిత సంఘటనలను ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తాజాగా మేకర్స్ చిత్ర విడుదల తేదీని ప్రకటించారు.

మే 3న థియేటర్లలోకి జితేందర్ రెడ్డి సినిమాను తీసుకురాబోతున్నట్లుగా దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.