19 January 2024

రికార్డులు బద్దలు కొడుతున్న 'కుర్చీ మడతపెట్టి' సాంగ్

TV9 Telugu

అతడు, ఖలేజా... త్రివిక్రమ్ డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న మోస్ట్ అవేటెడ్‌ థర్డ్‌ ఫిల్మ్ గుంటూరు కారం

సంక్రాంతి కానుకగా జాన్‌ 12న రిలీజ్ అయిన గుంటూరు కారం కలెక్షన్స్‌తో.. బాక్సాఫీస్ బద్దలు కొడుతోంది.

ఓ పక్క గుంటూరు కారం 200కోట్ల క్లబ్‌ వైపు పరుగులు పెడుతోంది.

మూవీ నుంచి రిలీజ్‌కు ముందు రిలీజ్ అయిన ఊరమాసు కుర్చీ సాంగ్‌.. అటు యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది.

యూట్యూబ్‌లో ఉన్న ఈ మూవీ మాస్‌ సాంగ్‌.. సోషల్ మీడియాలో రచ్చ రంబోలా చేస్తోంది.

తాజాగా యూట్యూబ్‌లో 50 మిలియన్ మార్క్‌ను తాకి.. ఇప్పుడు యూట్యూబ్‌లో సెన్సేషనల్‌గా కూడా మారిపోయింది.

రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించిన ఈ సాంగ్‌.. 2023 ఇయర్ ఎండ్ సెలబ్రేషన్స్‌ను కూడా నెక్ట్స్‌ లెవల్‌కు తీసుకెళ్లింది.