22 June 2024

సీరియల్లో పద్దతిగా చీరకట్టులో.. నెట్టింట భీభత్సంగా.. ఎవరంటే.. 

Rajitha Chanti

Pic credit - Instagram

బుల్లితెరపై సీరియల్స్‏కు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. అందులో  ఇప్పుడు గుండె నిండా గుడి గంటలు సీరియల్‏కు మంచి రెస్పాన్స్ వస్తుంది. 

ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తుంది కన్నడ బ్యూటీ అమూల్య గౌడ. కన్నడలో పలు సీరియల్స్ చేసిన ఈ చిన్నది ఇప్పుడు తెలుగులో నటిస్తుంది. 

ఈ సీరియల్లో పద్దతిగా చీరకట్టులో కనిపిస్తూ తన నటనతో ఫ్యామిలీ ప్రేక్షకులకు దగ్గరయ్యింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‏గా ఉంటుంది. 

తాజాగా ఈ బ్యూటీ ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోస్ చూసి షాకవుతున్నారు ఫ్యాన్స్. సీరియల్లో పద్దతిగా కనిపించే అమూల్య చాలా కొత్తగా కనిపిస్తుంది.

సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్  చూస్తుంటే మతిపోవాల్సిందే. తన అందాలతో నెటిజన్స్ మతిపోగొడుతుంది ఈ కన్నడ భామ. 

రెగ్యులర్ గా ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇక అందాల ఆరబోతలో హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోవడం లేదు ఈ బ్యూటీ. 

ప్రస్తుతం అమూల్యకు ఇన్ స్టాలో 5 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. నెట్టింట గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులను కవ్విస్తుంది ఈ ముద్దుగుమ్మ. 

తాజాగా అమూల్య నెట్టింట షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి. అందులో అమూల్య గ్లామరస్ లుక్ చూసి షాకవుతూ భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు.