28 September 2025

వయసు 43.. ఒక్కో సినిమాకు రూ.40 కోట్లు.. ఈ హీరోయిన్ క్రేజ్ చూస్తే..

Rajitha Chanti

Pic credit - Instagram

పాన్ ఇండియా కాదు.. కాదు గ్లోబల్ బ్యూటీ. ఇన్నాళ్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో చక్రం తిప్పిన ఈ బ్యూటీ ఇప్పుడు హాలీవుడ్‏లో వరుస ఆఫర్లతో సత్తా చాటుతుంది.

దశాబ్దాలపాటు హిందీ చిత్రపరిశ్రమను ఏలేసిన ఈ అమ్మడు.. హీరోలకు సమానంగా పారితోషికం తీసుకుంది. ఇప్పుడు తెలుగులోనూ నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. 

గత నాలుగేళ్లుగా బాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆమె ప్రస్తుతం ఒక్క సినిమా కోసం  దాదాపు రూ.40 కోట్లకు పైగా పారితోషికం తీసుకుందని సమాచారం. 

ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ ప్రియాంక చోప్రా. బీహార్ రాష్ట్రంలో జన్మించిన ఆమె గతంలో హిందీలో ఒక్కో సినిమాకు రూ.20 కోట్లు తీసుకుందని టాక్.

2002లో విజయ్ దళపతి జోడిగా తమిళన్ సినిమాతో కథానాయికగా తెరంగేట్రం చేసింది. హీరోయిన్‏గా ప్రియాంకకు ఇదే మొదటి సినిమా కావడం గమనార్హం.

ఆ తర్వాత హిందీలో వరుస అవకాశాలు అందుకుంటూ తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకుంది. అలాగే ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ చేసింది ఈ బ్యూటీ.

అమెరికా సింగర్ నిక్ జోనాస్ తో పెళ్లి తర్వాత లాస్ ఏంజిల్స్ లో సెటిల్ అయ్యింది ప్రియాంక. ప్రస్తుతం హాలీవుడ్ ఇండస్ట్రీలోనే వరుస సినిమాల్లో నటిస్తుంది. 

ఇప్పుడు ఆమె తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబుతో SSMB 29 చిత్రంలో నటిస్తుంది. నివేదికల ప్రకారం ఆమె ఆస్తులు రూ.650 కోట్లకు పైగానే ఉన్నాయట.