29 June 2024
జిమ్ సూట్లో గ్లామర్ బీభత్సం.. కిల్లర్ బ్యూటీ స్టన్నింగ్ లుక్..
Rajitha Chanti
Pic credit - Instagram
బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో అలియా భట్ ఒకరు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది.
మొదటి సినిమాతో హిట్టు కొట్టిన అలియా అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్గా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.
జక్కన్న తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇటు సౌత్ అడియన్స్కు పరిచయమైంది. ఇందులో సీత పాత్రలో మెప్పించింది ఈ బ్యూటీ.
తాజాగా అలియాకు సంబంధించిన జిమ్ ఫోటో నెట్టింట వైరలవుతుంది. మిర్రర్ ముందు సెల్ఫీ తీసుకుంటున్న పిక్ ఆశ్చర్యపరుస్తుంది.
చిన్నప్పుడు ఎంతో బొద్దుగా ఉన్న అలియా ఆ తర్వాత గుర్తుపట్టడానికి వీలు లేనంతగా సన్నజాజీలా మారిపోయింది హీరోయిన్ అలియా.
రోజుకు ఆరు నుంచి ఏడుసార్లు భోజనం చేస్తుందట. అలాగే పోహా, గుడ్లు, శాండ్ విచ్ వంటి ఆహారాలను ఉదయం తీసుకుంటుందట.
వేరుశనగలు, మఖానాలు లేదా పండ్లు బ్రేక్ ఫాస్ట్ తర్వాత తీసుకుంటుంది. పప్పు, రోటీ, చావల్, సలాడ్ మధ్యాహ్నం భోజనమని తెలిపింది.
రాత్రి పెరుగన్నం తీసుకుంటుంది. అలాగే వర్కౌట్స్ చేసిన తర్వాత కుంకుమ పువ్వు కలిపిన నిమ్మరసం, కొబ్బరి నీళ్లు తీసుకుంటుందట.
ఇక్కడ క్లిక్ చేయండి.