26 May 2024

ఈ క్యూట్ చిన్నారి టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది.. ఎవరో తెలుసా..?

Rajitha Chanti

Pic credit - Instagram

బూరె బుగ్గలతో క్యూట్‎గా కనిపిస్తున్న చిన్నారి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. సౌత్ ఇండస్ట్రీలో గ్లామర్ ఇమేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ఎవరో తెలుసా..?

ఆ చిన్నారే హీరోయిన్ నేహా శెట్టి. సిద్ధూ జొన్నలగడ్డ సరసన డిజే టిల్లు సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సెషన్ అయ్యింది హీరోయిన్ నేహా. 

ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల నుంచి రాధిక పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో నేహాకు వరుస అవకాశాలు వచ్చాయి. 

తెలుగులో అనేక చిత్రాల్లో నటించిన నేహా.. ప్రస్తుతం గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమాలో నటిస్తుంది. ఇందులో విశ్వక్ సేన్, అంజలి కీలకపాత్రలు పోషించారు. 

డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ హీరోగా నటించిన మెహబూబా సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యి.. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 

ఆ తర్వాత గల్లీ రౌడీ మూవీలో నటించింది. ఈ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాలు అందుకోలేదు. ఆ తర్వాత డీజే టిల్లుతో ప్రేక్షకులను పలకరించింది. 

ఇటీవల టిల్లు స్క్వేర్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించింది నేహా. ప్రస్తుతం విశ్వక్ నటించిన గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమా ప్రమోషన్లలో పాల్గొంటుంది.

ఇటీవల టిల్లు స్క్వేర్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించింది నేహా. ప్రస్తుతం విశ్వక్ నటించిన గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమా ప్రమోషన్లలో పాల్గొంటుంది.