26 January 2025
40 ఏళ్లు దాటినా చెక్కు చెదరని అందం.. ఈ బ్యూటీ ఎవరంటే..
Rajitha Chanti
Pic credit - Instagram
ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఆమె స్టార్ హీరోయిన్. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది.
గ్లామర్ షోలకు దూరంగా ఉంటూ సంప్రదాయ పద్దతిలో కనిపిస్తూ.. ఎన్నో పాత్రలతో అడియన్స్ హృదయాల్లో చోటు సంపాదించుకుంది.
ఆ హీరోయిన్ మరెవరో కాదు టాలీవుడ్ అందాల రాశీ స్నేహ. గ్లామర్ కు దూరంగా కేవలం హోమ్లీ రోల్స్ పోషిస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది.
రాధాగోపాలం, ప్రియమైన నీకు, శ్రీరామదాసు వంటి చిత్రాల్లో నటించి మెప్పించిన స్నేహ.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.
తమిళ్ హీరో ప్రసన్నను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి బాబు, పాప ఉన్నారు. ప్రస్తుతం స్నేహ సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ పోషిస్తుంది.
గతేడాది మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి సరసన క్రిస్టోఫర్ అనే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లో కీలక పాత్ర పోషించింది. అలాగే తమిళంలో ఓ సినిమా చేసింది.
ఇక ఇటీవలే తమిళంలో విజయ్ దళపతి నటించిన గోట్ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించింది. పెళ్లి తర్వాత ఎక్కువగా సహాయ పాత్రలు పోషిస్తుంది.
అలాగే స్నేహాలయం పేరుతో చీరల వ్యాపారం స్టార్ట్ చేసింది. అలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్