గౌతమ్ తిన్ననూరి కొత్త సినిమా.. నిర్మాత SKN తాజా మూవీ..

TV9 Telugu

30 January 2024

విజయ్ దేవరకొండ సినిమా కొన్ని రోజులు ఆగిపోవడంతో.. ఈ గ్యాప్‌లోనే మ్యాజిక్ అనే సినిమా చేసారు గౌతమ్ తిన్ననూరి.

సంగీతం నేపథ్యంలో ఈ సినిమా వస్తుంది. సితార ఎంట‌ర్‌టైన‌మెంట్స్ బ్యాన‌ర్‌పై నాగ‌వంశీ మ్యాజిక్ సినిమాను నిర్మిస్తున్నారు.

సౌత్ ఇండియన్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ర‌విచంద‌ర్ మ్యాజిక్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

తెలుగుతో పాటు త‌మిళ భాష‌లో కూడా 2024 స‌మ్మ‌ర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు మూవీ మేకర్స్.

తెలుగులో బేబీ లాంటి కల్ట్ సినిమాను అందించిన నిర్మాత SKN తాజాగా మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

మ‌ణికంద‌న్‌, శ్రీ‌గౌరీ ప్రియ జంట‌గా ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా సినిమా ట్రూ లవర్.

ఈ సినిమాకు సీన్ రోల్డ‌న్ సంగీతాన్ని అందించారు. ఈ అనువాద సినిమాను మారుతి, ఎస్‌కేఎన్ కలిసి తెలుగులోకి తీసుకొస్తున్నారు.

తాజాగా ట్రూ లవర్ సినిమా టీజర్ విడుదల చేసారు మూవీ మేకర్స్. దీని గురించి మరిన్ని విషయాలు త్వరలో వెల్లడించనున్నరు.