గ్లామర్ లుక్స్‏తో గత్తరలేపుతోన్న చైల్డ్ ఆర్టిస్ట్.. ఈ అమ్మడు బీభత్సమే..

Phani CH

02 Jul 2025

Credit: Instagram

గౌరీ జి కిషన్‌.. బాలనటిగా కెరీర్ ని ప్రారంభించింది. తమిళంలో సూపర్‌ హిట్ ఫిల్మ్ `96` చిత్రంలో ఆమె టీనేజ్‌ అమ్మాయిలా నటించింది. త్రిష, విజయ్ సేతుపతి జంటగా నటించిన విషయం తెలిసిందే. అక్కడ అది పెద్ద హిట్ అయ్యింది.

ఈ సినిమాని తెలుగులో సమంత, శర్వానంద్‌ కాంబినేషన్‌లో రీమేక్‌ చేశారు. మాతృక దర్శకుడే రూపొందించారు. కానీ ఆడలేదు. 

తెలుగులో `జాను` పేరుతో రీమేక్‌ చేశారు. ఈ సినిమాలోనూ చైల్డ్ ఆర్టిస్ట్ గా గౌరీనే నటించడం విశేషం. అదే మ్యాజిక్ రిపీట్‌ చేసింది.

తమిళంలో టీనేజ్‌ అమ్మాయిగా కనిపిస్తూ వచ్చింది గౌరీ జి కిషన్‌. విజయ్‌ తో `మాస్టర్‌` మూవీ, ధనుష్‌తో `కర్ణన్‌`, చిత్రాలు చేసింది.

మలయాళంలోనూ మెరిసిందీ ముద్దుగుమ్మ. ఇటీవల హీరోయిన్‌గానూ తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. 

`శ్రీదేవి శోభన్‌ బాబు` చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఈసినిమా యావరేజ్‌గా మెప్పించింది. ఇందులో హీరోయిన్‌గా అలరించింది గౌరీ. 

తెలుగులో ఈ అమ్మడికి పెద్దగా ఆఫర్లు లేవు. దీంతో సొంతం ఇండస్ట్రీలోనే రాణించేందుకుప్రయత్నిస్తుంది. మరోవైపు మ్యూజిక్‌ వీడియోస్‌తోనూ అలరిస్తుంది.