జిల్ కాంబో రిపీట్.. అల్లు అర్జున్ @ 25 మిలియన్..

TV9 Telugu

23 March 2024

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన రాధేశ్యామ్ డిజాస్టర్ అయింది.

దీనికి ముందు వచ్చిన గోపీచంద్ జిల్ కూడా ఫ్లాపే. తాజాగా ఈ దర్శకుడి మూడో సినిమాకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

గోపీచంద్‌తోనే మరోసారి రాధాకృష్ణ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది. యువీ క్రియేషన్స్‌లోనే ఈ సినిమా ఉండే అవకాశం ఉంది.

సినిమాలు మాత్రమే కాదు.. ఇన్‌స్టాగ్రామ్ కూడా తన అడ్డానే అంటున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈయనకు అక్కడున్న ఫాలోయింగ్ భీభత్సం అంతే.

సౌత్‌లో 25 మిలియన్ ఫాలోయర్స్‌ అందుకున్న మొదటి హీరోగా హిస్టరీ క్రియేట్ చేసారు అల్లు అర్జున్. ఇన్‌స్టాలో బన్నీకి తిరుగులేదు.

రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఆడు జీవితం సినిమా ప్రమోషన్ స్పీడు పెంచారు మేకర్స్‌. దీని షూటింగ్‌కు సంబంధించి ఇంట్రస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు.

ఒక సీన్లో ఆకలితో అలమటించే వ్యక్తిగా కనిపించేందుకు 72 గంటల పాటు తిండి మానేశారట హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్.

మూడు రోజుల పాటు కేవలం నీళ్లు బ్లాక్ కాఫీ మాత్రమే తాగి ఆ సీన్‌ పూర్తి చేశానని చెప్పారు వరదరాజ మన్నార్.