TV9 Telugu

బ్రహ్మ రాక్షసుడు భీమా వచ్చేసాడు.. గమ్యాన్నే వెతుకుతూ గామి.. 

26 Febraury 2024

గోపీచంద్ హీరోగా కన్నడ దర్శకుడు హర్ష తెరకెక్కిస్తున్న యాక్షన్ డ్రామా చిత్రం భీమా. ఇందులో పోలీస్ గా కనిపించనున్నారు గోపీచంద్.

తాజాగా ఈ చిత్ర ట్రైలర్ లాంఛ్ వేడుక జరిగింది. అక్కడే సినిమా ట్రైలర్ కూడా విడుదల చేసారు దర్శక నిర్మాతలు.

సినిమా మార్చ్ 8న శివరాత్రి సందర్భంగా విడుదల కానుంది. ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్‌టైనర్‌గా భీమా వస్తుంది.

తణికెళ్ళ భరణి, 30 ఇయర్స్ పృథ్వి లాంటి సీనియర్ నటులు ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా మా ఇంటి నెంబర్ 13.

ఈ సినిమా నుంచి తాజాగా ఓ ప్రమోషనల్ సాంగ్ విడుదలైంది. హార్రర్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సినిమాకు పన్నా రాయల్ తెరకెక్కిస్తున్నారు.

విశ్వక్ సేన్, చాందిని చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా గామి. విద్యాధర్ ఈ సినిమాను తెరకెక్కిస్తునారు.

తాజాగా ఈ చిత్రం నుంచి గమ్యాన్నే అంటూ సాగే లిరికల్ సాంగ్ ను యూట్యూబ్ ద్వారా విడుదల చేసారు మూవీ మేకర్స్.

మార్చ్ 8న శివరాత్రి సందర్భంగా గామి సినిమా విడుదల కానుంది. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుంది.