భీమా రొమాంటిక్ సాంగ్.. ఆ హిందీ మూవీ కోసం రణబీర్ మేకోవర్..
TV9 Telugu
10 February 2024
గోపిచంద్ హీరోగా తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ డ్రామా భీమా. ఈ సినిమాతో కన్నడ దర్శకుడు ఏ హర్ష టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు.
శివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసారు మేకర్స్.
ఏదో ఏదో మాయ అంటూ సాగే ఈ పాట ప్రోమోకు మంచి రెస్పాన్స్ వస్తోంది. త్వరలో టీజర్, ట్రైలర్ కూడా విడుదల కానున్నాయి.
అవతార్ ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చారు అవతార్ తో మరో కొత్త ప్రపంచాన్ని సృష్టించిన దర్శకుడు జేమ్స్ కామెరూన్.
ప్రస్తుతం అవతార్ 3, 4, 5కి సంబంధించిన వర్క్ జరుగుతుందన్న డైరెక్టర్, మరో రెండు సీక్వెల్స్ కూడా ఉండే ఛాన్స్ ఉందన్నారు.
అయితే ఆరు, ఏడు భాగాలకు తాను దర్శకత్వం వహించకపోవచ్చు అన్నారు కామెరూన్. 2031లో అవతార్ 5 ప్రేక్షకుల ముందుకు రానుంది.
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ మరో చాలెంజింగ్ రోల్‌కు రెడీ అవుతున్నారు. నితిష్ తివారి దర్శకత్వంలో రామాయణంలో నటించబోతున్నారు.
ఈ సినిమా షూటింగ్ సమ్మర్‌లో ప్రారంభించే ఆలోచనలో ఉంది చిత్రయూనిట్. ఇప్పటికే మేకోవర్ మీద దృష్టి పెట్టారు రణబీర్ కపూర్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి