ట్రిపుల్ ఆర్ సినిమా రావడం, బాక్సాఫీస్ బద్ధలు కొట్టడం, ఆస్కార్ వేదిక మీద సందడి చేయడం, నేషనల్ అవార్డులు తెచ్చుకోవడం... అన్నీ విజయవంతంగా జరిగిపోయాయి.
తారక్ ఫ్యాన్స్ కి ఇవన్నీ హ్యాపీన్యూస్‌లే. అయినా... తారక్ నెక్స్ట్ సినిమా విడుదల గురించి ఆసక్తి ఏమాత్రం తగ్గడం లేదు.
ట్రిపుల్ ఆర్‌ని మించిన సినిమా కావాలని పట్టుబడుతున్నారు ఫ్యాన్స్. జనతాగ్యారేజ్ కాంబో నుంచి అంతకు మించిన సక్సెస్‌ని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.
జనతాగ్యారేజ్‌లో మాస్ ఎలివేషన్ ని ఏం చూశారు? దేవరలో చూసి చెప్పండి.. కొరటాల మార్క్ మాస్ అంటే ఏంటో అనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది మూవీ యూనిట్‌లో.
ఇప్పుడు దేవర సినిమాతో బిజీగా ఉన్నారు కొరటాల. ఆచార్య విషయంలో జరిగిన పొరపాటు మళ్లీ జరగకుండా చూసుకోండి సారూ అంటూ సలహాలు వినిపిస్తున్నాయి ఆయనకి.
ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో పూనకాలు పుట్టించే సునామీ సీక్వెన్స్ ఉంటుందట.
దీని కోసం భారీ స్విమ్మింగ్ పూల్ సెట్ వేస్తున్నారని టాక్. ఈ సీన్ కోసమే అండర్‌వాటర్ యాక్షన్ సీక్వెన్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు తారక్.
దాదాపు 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో దేవరను రూపొందిస్తున్నారనే వార్తలూ ఫిల్మ్ నగర్‌లో జోరందుకున్నాయి. ప్యాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోంది మూవీ.