గూఢచారి 2 అప్‌డేట్..  మెర్సీ కిల్లింగ్ ఈవెంట్.. 

TV9 Telugu

01 April 2024

అడివి శేష్‌ హీరోగా వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ గూఢచారి 2.

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ ప్రముఖ స్టార్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఇందులో విలన్‌గా నటిస్తున్నారని తెలిసిందే.

గతంలో వచ్చిన హిట్ సినిమా గూఢచారికి కొనసాగింపుగా వస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ గుజరాత్‌లో శరవేగంగా జరుగుతుంది.

తాజాగా గుజరాత్ భుజ్‌ షూట్‌లోని షెడ్యూల్‌లో హీరోయిన్ బనితా సంధు జయిన్ అయ్యారు. శేష్, బనితాపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య, హారిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న టాలీవుడ్ సినిమా మెర్సీ కిల్లింగ్.

సూరపల్లి వెంకటరమణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తైందని తెలిపారు ఈ మూవీ మేకర్స్.

తాజాగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో మెర్సీ కిల్లింగ్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు దర్శకనిర్మాతలు.

కోన వెంకట్ సహా చాలా మంది టాలీవుడ్ ప్రముఖులు సినిమా యూనిట్ ఈ ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథులుగా వచ్చారు.