G2 లోడింగ్.. మంజుమ్మెల్ బాయ్స్ ప్రీమియర్స్..
TV9 Telugu
06 April 2024
ఐపిఎల్ సీజన్‌ను సినిమాల ప్రొమోషన్స్ కోసం వాడుకుంటున్నారు మన హీరోలు. తాజాగా అడివి శేష్ సైతం ఇదే చేసారు.
బఫరింగ్ బాధ ఉండొచ్చు.. కానీ ఒక్కసారి లోడ్ అయితే విస్పోటనం మామూలుగా ఉండదు అంటూ గూడఛారి 2 గురించి ట్వీట్ చేసారు.
దీనికి మాజీ కెప్టెన్ ధోనీ ఈ మధ్యే ఐపిఎల్‌లో ఆడిన ధనాధన్ ఇన్నింగ్స్‌ను ట్యాగ్ చేసారు. దాంతో ఆ ట్వీట్ వైరల్ అవుతుందిప్పుడు.
గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా గూఢచారి సినిమాకి సీక్వెల్ గా వస్తున్న గూడఛారి 2 సినిమా. దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.
మలయాళ చిత్ర పరిశ్రమలో ఎన్నడూ లేని విధంగా 200 కోట్లకు పైగా వసూలు చేసిన మొదటి చిత్రం మంజుమ్మెల్ బాయ్స్.
ఈ సినిమాను తెలుగులో ఏప్రిల్ 6న విడుదల చేయబోతున్నారు ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్.
ఈ మలయాళీ సర్వైవల్ థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ కూడా ముందు ఒక రోజు ముందుగానే వేశారు దర్శకనిర్మాతలు.
తెలుగులోనూ మంజుమ్మెల్ బాయ్స్ సినిమా మ్యాజిక్ చేస్తుందని బలంగా నమ్ముతున్నారు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి