గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ ఫస్ట్ లుక్ అదిరిందిగా..!

TV9 Telugu

22 May 2024

అజిత్‌ కుమార్‌ హీరోగా నటిస్తున్న సినిమా గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ. మార్క్ ఆంథోని ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకుడు.

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ దిగ్గజ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తుంది.

ఇందులో అజిత్ కుమార్ సరసన స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ కథానాయకిగా నటిస్తుంది. వీరిద్దరూ జంటగా గతంలో కూడా సినిమాలు చేశారు.

రెజీనా కసాండ్రా కూడా గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ మరో హీరోయిన్ గా కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ పక్కన కనిపించనుంది.

అర్జున్ సర్జా, అరుణ్ విజయ్, ఆరవ్ వంటి స్టార్ నటులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నట్టు మేకర్స్ వెల్లడించారు.

సౌత్ ఇండస్ట్రీ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ సినిమాకి స్వరాలు సమకూరుస్తున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి అజిత్‌కుమార్‌ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు మూవీ మేకర్స్. ఇది సినీ ప్రేమికులను ఆకట్టుకుంది.

ఇటీవల హైదరాబాద్‌లో రెగ్యులర్‌ షూటింగ్‌ని మొదలుపెట్టారు.  వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను రేసులో నిలపాలన్నది మేకర్స్ ప్లాన్‌.