12 October 2023
దిమ్మతిరిగే న్యూస్.. విజయ్ లియోలో.. చెర్రీ కీ రోల్.
లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో.. విజయ్ దళపతి చేస్తున్న డార్క్ యాక్షన్ బేస్డ్ మూవీ లియో..
అక్టోబర్ 19న రిలీజ్‌కు రెడీ అయిన ఈ మూవీ.. చెర్రీ ఫ్యాన్స్ కారణంగా సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది.
ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్ సైట్లలో.. రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నట్టు ఉంది.
లియో క్యాస్టింగ్ లిస్టులో.. హీరో విజయ్‌తో పాటు.. రామ్ చరణ్ కూడా నటిస్తున్నట్టు క్లియర్ గా ఉంది.
ఇక దీన్ని గమనించిన మెగా స్టార్ ఫ్యాన్స్.. ఈ న్యూస్‌ను నెట్టింట విపరీతంగా వైరల్ చేస్తున్నారు.
లియో సినిమాలో రామ్ చరణ్ అంటూ.. ఏకంగా పోస్టర్స క్రియేట్ చేసిన వైరల్ చేస్తున్నారు.
అమెరికా టికెట్ బుకింగ్ వెబ్‌సైట్‌లో రామ్ చరణ్ పేరు కనిపించింది. నటీనటుల జాబితాలో చరణ్ పేరు చేర్చబడింది.
అయితే లియో మేకర్స్ నుంచి మాత్రం.. ఈ న్యూస్ పై ఎలాంటి స్పందన ఇంతవరకు రాలేదు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి