ఇండియాలో గ్లాస్ బ్రిడ్జీలు ఉన్న ప్రదేశాలు ఇవే

Phani.ch

02 June 2024

గ్లాస్ బ్రిడ్జీ మనం ఎక్కువగా ఇతర దేశాల్లో చూస్తూ ఉంటాం. కానీ మాన దేశంలో కూడా ఈ గ్లాస్ బ్రిడ్జిలు ఉన్నాయని చాలా తక్కువ మందికి తెలుసు.

ఎత్తైన ప్రదేశాల్లో నిర్మించే గ్లాస్ బ్రిడ్జీలపై తిరగడం అంటే నిజంగానే అద్భుతమైన థ్రిల్‌ను ఇస్తుంది. చాలామంది ఇష్టపడుతుంటారు. 

అయితే ఇండియాలో గ్లాస్ బ్రిడ్జీలు ఎక్కడెక్కడున్నాయో తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో పర్యాటకుల సంఖ్య విశేషంగా పెరుగుతోంది. 

ఉత్తరప్రదేశ్‌లో చిత్రకూట్‌లోని  రాముని ధనస్సు ఆకారంలో గ్లాస్ బ్రిడ్జి ఇది. ఈ వంతెన పొడవు 25 మీటర్లు ఉంటుంది.

కేరళలో వాయనాడ్ లోని గ్లాస్ బ్రిడ్జి ఉంది. ఈ ప్రాంతం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ బ్రిడ్జి పర్యాటకులను బాగా ఆకర్షిసిస్తుంది.

మరొకటి బీహార్‌లోని నలందా జిల్లాలో స్కై వాక్ ఎంజాయ్ చేసే అద్భుత ప్రదేశం. ఈ వంతెన పొడవు 85 అడుగులుంటుంది. 200 అడుగుల ఎత్తులో ఉంటుంది. 

సిక్కిం లో  నిర్మించి గ్లాస్ బ్రిడ్జి పర్యాటకుల్ని మరింతగా ఆకట్టుకుంటోంది.  ఈ బ్రిడ్జి సముద్రమట్టం నుంచి ఏకంగా 7200 అడుగుల ఎత్తులో ఉంటుంది.