ఓటీటీ లోకి వచ్చేస్తున్నా రాజు యాదవ్.. ఎప్పుడంటే ??
TV9 Telugu
11 June 2024
గెటప్ శ్రీను గురించి బుల్లి తెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. జబర్దస్త్ కామెడీ షోతో చాలా పాపులర్ అయ్యా
డు.
జబర్దస్త్ తో వచ్చిన గుర్తిపుతో అనేక చిత్రాల్లో కమెడియన్‍గా నటించాడు గెటప్ శ్రీను. అతడి యాక్టింగ్ టాలెంట్‍కు చాలా ప్రశంసలు ద
క్కాయి.
ఇది ఇలా ఉంటే తాజాగా గెటప్ శ్రీను సోలో హీరోగా రాజు యాదవ్ చిత్రం వచ్చింది ఈ చిత్రం ఈ ఏడాది మే 24వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది.
ఇంట్రెస్టింగ్ పాయింట్‍తో రావటంతో ఈ మూవీపై క్రేజ్ ఏర్పడింది. అయితే, థియేటర్లలో అంచనాలను ఈ చిత్రం అందుకోలేకపోయింది.
అయితే, గెటప్ శ్రీను హీరోగా నటించిన రాజు యాదవ్ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు రానుందో అనే విషయం బయటికి వచ్చింది.
అయితే రాజు యాదవ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్ దక్కించుకుందని తెలుస్తోంది.
అయితే ఈ సినిమా జూన్ 22వ తేదీన ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం.. ఈ విషయంపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.
ఇక్కడ క్లిక్ చేయండి