ఈ తరం కామెడియన్లలో  చిరంజీవి ఫెవరెట్ అతనేనట

Phani.ch

13 May 2024

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. టాలెంట్ ఉన్నవాళ్లను ప్రోత్సహించే విషయంలో ఎప్పుడు ముందుంటారు మెగాస్టార్.

అయితే ఈతరం యంగ్ కమెడియన్స్ లో  చిరంజీవి తనకు ఇష్టమైన కమెడియన్ పేరు చెప్పగా ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

చిరుకి ఇష్టమైన ఆ కమెడియన్ మరెవరో కాదు జబర్దస్త్ కమెడియన్లలో ఒకరైన గెటప్ శ్రీను అని చెప్పిన ఒక వీడియో బైట్ రిలీజ్ చేశారు.

ఇది ఇలా ఉంటే గెటప్ శ్రీను ఈ మధ్య కాలంలో చిరంజీవి సినిమాలలో వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.

అయితే తాజాగా రాజు యాదవ్ సినిమాతో గెటప్ శ్రీను హీరోగా చేస్తూ తన లక్ పరీక్షించుకుంటున్నాడు ఈ జబర్దస్త్ కమెడియన్.

రాజు యాదవ్ సినిమా ప్రమోషన్స్ కు హెల్ప్ కావాలనే ఆలోచనతో మెగాస్టార్ ఈ వీడియో బైట్ ను రిలీజ్ చేయడం జరిగింది.

గెటప్ శ్రీను ఈ సినిమాతో సక్సెస్ వస్తుదని తనకి నమ్మకం ఉందని తెలిపారు మెగాస్టార్. శ్రీనును చూస్తే ఒకప్పటి కమెడియన్ చలం గుర్తుకు వస్తాడని ఆయన పేర్కొన్నారు.

చిరంజీవి తన సినిమా యూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెప్పడంతో గెటప్ శ్రీను స్పందిస్తూ కల్మషం లేని మీ ప్రేమకు సదా భక్తుడిని పద్మ విభూషణ అంటూ కామెంట్ చేశారు.