27 August 2025

జెనీలియా అందం రహాస్యం ఇదేనట.. 37 ఏళ్ల వయసులో ఇలా.. 

Rajitha Chanti

Pic credit - Instagram

సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు చక్రం తిప్పిన హీరోయిన్ జెనీలియా. తెలుగు, తమిళం భాషలలో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.

బొమ్మరిల్లు, నా అల్లుడు, ఆరెంజ్, బాయ్స్ వంటి చిత్రాలతో సినీప్రియులను ఆకట్టుకున్న ఈ వయ్యారి.. అటు హిందీలోనూ సక్సెస్ అయ్యింది. 

ఇండస్ట్రీలో వరుస సినిమాలతో కెరీర్ మంచి ఫాంలో ఉండగానే బాలీవుడ్ స్టార్ హీరో రితేశ్ దేశ్ ముఖ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 

పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైన ఈ అమ్మడు.. ఇటీవలే తెలుగు, హిందీ భాషలలోకి రీఎంట్రీ ఇచ్చింది. జూనియర్ సినిమాలో నటించింది. 

ప్రస్తుతం జెనీలియా వయసు 37 సంవత్సరాలు. ఈ వయసులోనూ తన ఫిట్నెస్, లుక్స్ తో అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది ఈ హీరోయిన్. 

తాజాగా తన ఫిట్నెస్ సీక్రెట్ రివీల్ చేసింది. 2017 నుంచి తాను శాఖాహారిగా మారి.. అటు పాల ఉత్పత్తులకు దూరంగా ఉన్నట్లు తెలిపింది. 

 అలాగే మొక్కల ఆధారిత ఫుడ్ మాత్రమే తీసుకుంటున్నాని.. తగినంత ప్రోటీన్ తీసుకుంటున్నట్లు, పోషకాలు అధికంగా ఉండేలా చూసుకుంటుందట. 

గతంలో 100 కిలోల బరువు పెరిగిన జెనీలియా.. అరటి పండు, పాలక్ టోపు వంటి ఆహార పదార్థాలు మాత్రమే తీసుకున్నానని వెల్లడించింది.