01 June 2025

జెనీలియా ఫిట్నెస్ రహాస్యం ఇదేనట.. తల్లైన తగ్గని అందం..

Rajitha Chanti

Pic credit - Instagram

టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేసిన హీరోయిన్లలో జెనీలియా ఒకరు. తెలుగులో బొమ్మరిల్లు, సాంబ, నా అల్లుడు, ఆరెంజ్ వంటి చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకుంది. 

తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. అలాగే అటు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ వరుస సినిమాలతో సక్సెస్ అందుకుంది. 

 ప్రస్తుతం జెనీలియా వయసు 37 సంవత్సరాలు. ఇప్పటికీ ఏమాత్రం తగ్గని అందంతో మెస్మరైజ్ చేస్తుంటుంది. ఫిట్నెస్ పట్ల ఆమె ఎంతో ఆసక్తిగా ఉంటుంది. 

2017 నుంచి ఈ ముద్దుగుమ్మ పూర్తిగా శాఖాహారిగా మారిపోయిందట. పాల ఉత్పత్తులకు దూరంగా ఉంటూ కేవలం మొక్కల ఆధారిత ఫుడ్ తీసుకుంటుందట. 

తగినంత ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలని ముందుగానే ప్లాన్ చేసుకుందట ఈ అమ్మడు. పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్నే తీసుకుంటుందట ఈ బ్యూటీ. 

కొవ్వు తక్కువగా ఉండి పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడంతోపాటు నిత్యం కఠిన వ్యాయమాలు చేస్తుందట. గతంలో 100 కిలోల బరువు పెరిగిందట. 

అరటిపండులో 1 గ్రాము ప్రోటీన్ ఉంటుందని.. పాలక్ పనీర్ కు బదులుగా పాలక్ టోపు తీసుకున్నానని.. కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయట. 

అలాగే కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుందని తెలిపింది. చాలా కాలంగా తాను మాంసాహార పదార్థాలు తీసుకోవడం మానేశానని చెప్పుకొచ్చింది జెనీలియా.