గీతాంజలి మళ్లీ వచ్చింది ట్రైలర్..

TV9 Telugu

05 April 2024

టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ అంజలి టైటిల్ రోల్‌ చేస్తున్న తెలుగు హారర్ కామెడీ సినిమా గీతాంజలి మళ్లీ వచ్చింది.

2014లో వచ్చిన తెలుగు బ్లక్ బస్టర్ కామెడీ హారర్ సినిమా ‘గీతాంజలి’కి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది.

ఈ సినిమాలో శ్రీనివాస్‌ రెడ్డి క‌థ‌నాయ‌కుడిగా న‌టిస్తుండ‌గా.. సత్యం రాజేశ్‌, షకలక శంకర్‌, అలీ త‌దిత‌రులు కీలక పాత్రల్లో న‌టిస్తున్నారు.

టాలీవుడ్ సీనియర్ స్టార్ నటుడు సునీల్ కూడా ఇందులో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన అయన లుక్ ఆకట్టుకుంది.

కోన వెంక‌ట్ క‌థ, స్రీన్ ప్లేను అందిస్తుండ‌గా.. శివ తుర్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది.

ఈ చిత్రం ఏప్రిల్ 11న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

విడుదలకు సమయం దగ్గర పడుతుండడంతో ప్రొమోషన్స్ పర్వం జోరు పెంచింది గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ మేకర్స్.

ఇందులో భాగంగా విడుదల చేసిన పాటలు, పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీనికోసం ప్రేక్షకులు వేచి చూస్తున్నారు.