గీతాంజలి నైజాం హక్కుల ప్రముఖ నిర్మాత చేతిలోకి..
TV9 Telugu
20 March 2024
2014లో వచ్చిన హిట్ కామెడీ హారర్ 'గీతాంజలి' సినిమాకి 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు సీక్వెల్ చేస్తున్నారు మేకర్స్.
సీక్వెల్ గా వస్తున్న ఈ హారర్ కామెడీ చిత్రానికి 'గీతాంజలి మళ్లీ వచ్చింది' అనే టైటిల్ ఖరారు చేసింది చిత్రబృందం.
ఇందులోనూ టాలీవుడ్ కథానాయకి అంజలియే మెయిన్ రోల్ చేసారు. ఈ మధ్యే విడుదలైన టీజర్‌కి మంచి స్పందన వచ్చింది.
గీతాంజలి సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించిన శ్రీనివాస్ రెడ్డి, సత్య రాజేష్ కూడా ఇందులో నటిస్తున్నారు.
వీరితో పాటు సీనియర్ స్టార్ కమెడియన్స్ సునీల్, అలీ కూడా 'గీతాంజలి మల్లి వచ్చింది' సినిమాలో నటిస్తుంన్నారు.
ఈ ఏడాది ఏప్రిల్ 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ లో బిజీగా ఉంది చిత్రబృందం.
త్వరలోనే 'గీతాంజలి మళ్లీ వచ్చింది' ట్రైలర్ కూడా విడుదల చేయనున్నారు మూవీ మేకర్స్. అయితే ఎప్పుడు వస్తుందో చూడాలి.
ఇదిలా ఉంటె తాజాగా ఈ హారర్ కామెడీ చిత్ర నైజాం హక్కులను ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి