విజయోత్సాహంలో  గీతాంజలి..

TV9 Telugu

13 April 2024

అంజలి హీరోయిన్‌గా నటించిన హారర్ కామెడీ గీతాంజలి సినిమాకి కొనసాగింపుగా వచ్చిన గీతాంజలి మళ్లీ వచ్చింది.

దీనికి శివ తుర్లపాటి దర్శకత్వం వహించారు. మొదటి భాగానికి స్క్రీన్ ప్లే ఇచ్చిన కోన వెంకట్.. దీనికి కథ అందించారు.

ఫస్ట్ పార్ట్ లో నటించిన శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, శకలక శంకర్ ఇందులో కూడా ప్రధాన పాత్రల్లో నటించారు.

హారర్‌ కామెడీ కథాంశంతో తెరకెక్కింది ఈ సినిమా తాజాగా ఏప్రిల్ 11న తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఎం.వి.వి. సత్యనారాయణ, కోన వెంకట్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. సీనియర్ నటుడు సునీల్, సత్య ముఖ్య పాత్రలు పోషించారు.

ఈ చిత్రానికి ప్రేక్షకుల్లో మంచి స్పందన లభించింది. దీంతో సక్సెస్ సెలెబ్రేషన్స్ చేసుకొన్నారు మూవీ మేకర్స్.

రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన అన్ని చోట్లా మంచి స్పందన వస్తోందని అన్నారు చిత్ర నిర్మాత కోన వెంకట్‌.

ఈ సందర్భంగా గీతాంజలి మళ్లీ వచ్చింది చిత్ర యూనిట్‌ సభ్యులతో కలిసి సక్సెస్‌ మీట్‌ని ఏర్పాటు చేశారు కోన వెంకట్.