గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అప్డేట్.. ఓ పనైపోయింది బాబూ అంటున్న విజయ్..

TV9 Telugu

18 March 2024

విశ్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో వస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.

ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంస్థలపై సాయి సౌజన్య, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి ఇందులో హీరోయిన్. మే 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తాజా ప్రకటించారు.

తెలుగు, తమిళంలో యాక్షన్ సినిమాలతో తనకంటూ నటుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు మాస్ హీరో విశాల్.

దర్శకుడిగా మారాలని ఎప్పట్నుంచో కలలు కంటున్న విశాల్.. డిటెక్టివ్ 2 సినిమాతో తన డ్రీమ్ నెరవేర్చుకుంటున్నారు.

ఓ పనైపోయింది బాబూ అంటున్నారు విజయ్ దేవరకొండ. కొన్ని నెలలుగా ఫ్యామిలీ స్టార్ షూటింగ్‌లో నాన్ స్టాప్‌గా పాల్గొంటున్నారు రౌడీ బాయ్.

ముందుగా కమిట్ అయిన గౌతమ్ తిన్ననూరి సినిమాను పక్కనబెట్టి మరీ దిల్ రాజు సినిమాను పూర్తి చేసారు హీరో విజయ్.

తాజాగా ఈ చిత్ర షూటింగ్ పూర్తైనట్లు ప్రకటించారు దర్శక నిర్మాతలు. ఎప్రిల్ 5న విడుదల కానుంది ఫ్యామిలీ స్టార్.