తెలంగాణ సచివాలయంలో గంగవ్వ..
13 October 2023
బిగ్‌బాస్ ఫేమ్ గంగవ్వ అంటే తెలియనివారుండరు. మై విలేజ్ షోతో జనాల్లోకి వెళ్లిన గంగవ్వ బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా మరింత పాపులర్ అయ్యారు.
తాజాగా గంగవ్వ తెలంగాణ నూతన సచివాలయాన్ని సందర్శించారు. యూట్యూబర్ అనిల్ గీలాతో కలిసి హైదరాబాద్ లో పర్యటించిన గంగవ్వ..
అనేక ప్రముఖ పర్యాటక స్థలాలను సందర్శించారు. ఈ సందర్భంగా సచివాలయం లోపలికి ప్రవేశించిన తర్వాత .. అరవై నాలుగేళ్ల తన జీవితంలో తొలిసారి
ఇంత పెద్ద భవనం చూస్తున్నానంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు గంగవ్వ . సచివాలయం రాజభవనంలా ఉందని, ఇంత పెద్దగా ఎలా కట్టారంటూ ఆశ్చర్యపోయారు.
సచివాలయంలో లోపలికి వెళ్లిన అనంతరం..సచివాలయంలోకి పోనివ్వరని అన్నావు కదా అనీల్.. గంగవ్వ అంటే ఏమనుకున్నావు,
నన్ను చూసి లోపలికి అనుమతించారు చూశావా? అంటూ అనిల్ తో అన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తెలంగాణ సచివాలయంలో బిగ్‌బాస్ ఫేమ్ గంగవ్వ కలియ తిరుగుతున్న ఈ వీడియోను బీఆర్ఎస్ పార్టీ నేతలు షేర్ చేశారు.
తెలంగాణ అభివృద్ధిని ప్రత్యక్షంగా చూస్తూ ఆశ్చర్యపోతున్న గంగవ్వ అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజనులు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి