TV9 Telugu
గేమ్ ఛేంజర్ పై అనుకున్నదే నిజమైంది.. సామ్ ఫేవరెట్ హీరో ఎవరు.?
02 March 2024
ముందు నుంచి సోషల్ మీడియాలో అనుకుంటున్నట్లు దసరా, దీపావళి కాకుండా ఏకంగా డిసెంబర్‌కు వెళ్లిపోయాడు గేమ్ ఛేంజర్.
ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 25న విడుదల కానుంది గేమ్ ఛేంజర్. దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.
రవితేజ నున్న, నేహా జురెల్ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘రాజుగారి అమ్మాయి – నాయుడుగారి అబ్బాయి’. సత్యరాజ్ దర్శకుడు.
తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్ అంతా పాల్గొన్నారు. ఈ సినిమాకు రోషన్ సాలూరి సంగీతం అందించారు.
మంచు విష్ణు, మోహన్ బాబు కీలక పాత్రల్లో వస్తున్న సినిమా కన్నప్ప. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ చిత్ర రెండో షెడ్యూల్ తాజాగా న్యూజిలాండ్‌లో మొదలైంది.
మంచు విష్ణు, మోహన్ బాబు ఇద్దరూ ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. ఇందులో ప్రభాస్, మోహన్ లాల్ సహా తిదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
కొద్ది రోజులుగా సిల్వర్ స్క్రీన్‌కు దూరంగా ఉన్న సమంత, మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. తాజాగా తన ఫేవరెట్ హీరోను రివీల్ చేశారు సామ్.
మమ్ముట్టితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసి తన ఫేవరెట్ హీరో అని కామెంట్ చేశారు. ఫాహద్ ఫాజిల్ ఫోటోనూ షేర్ చేస్తూ తనకిష్టమైన మరో నటుడు అని కామెంట్ చేశారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి