TV9 Telugu

గేమ్ ఛేంజర్ మేజర్ అప్‌డేట్స్.. గామి ట్రైలర్ రూట్..

29 Febraury 2024

రామ్ చరణ్ హీరో శంకర్ తెరకెక్కిస్తున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్ మేజర్ అప్‌డేట్స్ రానున్నాయి.

మార్చ్ 27న చరణ్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ డేట్‌తో పాటు టీజర్ కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ RFCలో జరుగుతుంది.

హుషారు, రౌడీ బాయ్స్ లాంటి హిట్ చిత్రల ఫేమ్ హర్ష కొనుగంటి దర్శకత్వంలో వస్తున్న కామెడీ సినిమా ఓం భీమ్ బుష్.

తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలైంది. శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సినిమా పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తుంది. నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్ అంటూ వస్తుంది ఈ చిత్రం. యువీ క్రియేషన్స్ దీన్ని నిర్మిస్తున్నారు.

విశ్వక్ సేన్, చాందిని చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా గామి. విద్యాధర్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్ర ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి.

మార్చ్ 8న శివరాత్రి సందర్భంగా గామి సినిమా విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 29న ట్రైలర్‌ను ఐమాక్స్‌లోని బిగ్ స్క్రీన్‌పై విడుదల చేయబోతున్నారు.