ట్రేండింగ్ లో గేమ్ చెంజర్.. శ్రీ రంగనీతులు ట్రైలర్..

TV9 Telugu

02 April 2024

రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న పాన్ ఇండియా లెవెల్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా గేమ్ ఛేంజర్.

ఇటీవల మార్చ్ 27న పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ పాటను విడుదల చేసారు.

గేమ్ చెంజర్ మూవీ నుంచి వచ్చిన జరగండి జరగండి అంటూ సాగె ఈ పాటకు యూట్యూబ్‌లో అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది.

ఈ సాంగ్ రామ్ చరణ్ అభిమానులకు ఆకట్టుకొనేలా ఉంది. దీనికి ఇప్పటికే 20 మిలియన్ వ్యూస్ వచ్చినట్లు తెలిపారు దర్శక నిర్మాతలు.

సుహాస్‌, కార్తీక్‌ర‌త్నం, బేబీ ఫేమ్ విరాజ్ అశ్విన్ హీరోలుగా తెరకెక్కుతున్న తాజా సినిమా శ్రీ రంగనీతులు.

ప్ర‌వీణ్‌ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రుహాణి శర్మ ఈ డ్రామా ఎంటర్టైనర్ లో ప్రధాన పాత్రలో నటిస్తుంది.

రాధావి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి శ్రీ రంగనీతులు చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ చిత్ర ట్రైలర్ యూట్యూబ్ లో విడుదల చేసారు మూవీ మేకర్స్. ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకొనేలా ఉంది.