గామికి షాక్ ఇచ్చే ఓపెనింగ్స్.. భీమా ప్రెస్ మీట్..

TV9 Telugu

11 March 2024

విశ్వక్ సేన్, చాందిని చౌదరి ప్రధాన పాత్రల్లో విద్యాధర్ తెరకెక్కించిన తెలుగు అడ్వెంచర్ డ్రామా సినిమా గామి.

ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ట్రేడ్ వర్గాలకు కూడా షాక్ ఇచ్చాయి. తొలిరోజే ఏకంగా 9 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది గామి.

విశ్వక్ సేన్ కెరీర్‌లోనే అతిపెద్ద ఓపెనింగ్ ఇది. A సర్టిఫికేట్ వచ్చినా కూడా గామి వసూళ్లపై ఎలాంటి ప్రభావం కనిపించలేదు.

మాచో స్టార్ గోపీచంద్ హీరోగా కన్నడ దర్శకుడు హర్ష తెరకెక్కించిన తెలుగు ఫాంటసీ యాక్షన్ డ్రామా చిత్రం భీమా.

గత వారమే విడుదలైన ఈ మాస్ ఎంటర్‌టైనర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుందంటూ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు దర్శక నిర్మాతలు.

శివరాత్రి వీకెండ్ తమ సినిమా యూజ్ చేసుకుందని తెలిపారు మేకర్స్. ఇందులో ప్రియా భవాని శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్.

చిరంజీవి విశ్వంభర టీంలో కీల‌క మార్పు చోటు చేసుకొంది. ఈ చిత్రానికి సంభాష‌ణ‌లు అందిస్తున్న బుర్రా సాయిమాధ‌వ్ సినిమా నుంచి త‌ప్పుకొన్నారు.

ఆయ‌న స్థానంలో మ‌రో ర‌చ‌యిత టీమ్‌లో చేరారు. ఆయ‌న ఎవ‌ర‌న్న‌ది ప్రస్తుతానికి సస్పెన్స్. బుర్రా ఎందుకు వెళ్లిపోయారనేది కూడా సస్పెన్స్‌గానే ఉంది.