ఓటీటీలో రికార్డులు క్రియేట్ చేస్తున్న 'గామి'

TV9 Telugu

16 April 2024

మాస్ కా దాస్ విశ్వక్ సేన్  హీరోగా యాక్ట్ చేసిన న్యూ ఏజ్ ఫిల్మ్ 'గామి' మార్చి 8న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. 

విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'గామి' సినిమాలో తెలుగు అమ్మాయి చాందిని చౌదరి, ఎంజీ అభినయ, హారిక పెడదా, మహ్మద్ సమద్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.

థియేటర్లలో విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీలో కూడా రికార్డులు క్రియేట్ చెయ్యడం స్టార్ట్ చేసింది.

ప్రముఖ ఓటీటీ వేదిక 'జీ 5'లో ఏప్రిల్ 12న 'గామి' రిలీజ్ అయ్యింది. అంటే 11వ తేదీ రాత్రి నుంచి స్ట్రీమింగ్ మొదలైంది. 

'జీ5'లో విడుదలైన 72 గంటల్లో అరుదైన రికార్డు క్రియేట్ చేసింది. 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ కంప్లీట్ చేసుకుంది. 

72 గంటలు అంటే... 4320 నిమిషాలు. ఆ సమయంలో 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ 50 లక్షల నిమిషాల పాటు 'గామి'ని జనాలు చూశారన్నమాట.

సినిమాకు ఈ రేంజ్ రెస్పాన్స్ రావడంతో 'జీ 5' సంతోషంగా ఉంది. 2024 ఫస్ట్ బ్లాక్ బస్టర్ 'హను-మాన్', ఇప్పుడు 'గామి' సినిమాలు ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.