గామి ఓటిటి డేట్.. జితేందర్ రెడ్డి టీజర్..

TV9 Telugu

05 April 2024

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన భారతీయ ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రం సినిమా 'గామి'.

కొత్త దర్శకుడు విద్యాధర్ కాగిత తెరకెక్కించిన ఈ సినిమాలో అఘోరా పాత్రలో నటించి మెప్పించారు విశ్వక్ సేన్.

మార్చ్ 8న తేయాత్రలలో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. విశ్వక్ కెరీర్ లో ఓ మైల్ స్టోన్ గా నిలిచింది.

తాజాగా ఈ సినిమా ఓటిటి రిలీజ్ డేట్ ఖరారైంది. ఎప్రిల్ 12 నుంచి ప్రముఖ ఓటిటిలో ఇది స్ట్రీమింగ్ కానుంది.

ముదుగంటి క్రియేషన్స్ బ్యానర్‌‌‌పై విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా జితేందర్ రెడ్డి.

ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాహుబలి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రే హీరోగా నటిస్తున్నారు.

1980లలోని నిజ జీవిత సంఘటనలు ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. తాజాగా మేకర్స్ ఈ చిత్ర టీజర్ విడుదల చేసారు.

మే 3న థియేటర్లలోకి జితేందర్ రెడ్డి సినిమాను తీసుకురాబోతున్నట్లుగా దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.