TV9 Telugu

అవే గామి బలం? విశ్వక్.. చెర్రీతో ఖన్స్ స్టెప్స్..

05 March 2024

విశ్వక్ సేన్, చాందిని చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం గామి. ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రొమోషన్స్ లో భాగంగా భావోద్వేగాలే గామి సినిమాకు ప్రధాన బలం అని అంటున్నారు సినిమా హీరో విశ్వక్ సేన్.

థియేటర్లో ప్రేక్షకులు గామి చూసినంత సేపు అంతర్జాతీయ సినిమాను చూస్తున్న అనుభూతి కలుగుతుందని అన్నారు ఆయన.

ఐదేళ్ల క్రితం ఈ అడ్వెంచర్ సినిమాను ఒప్పుకున్నానని, ఇప్పుడైతే ఇలాంటి సినిమా చేయనని అన్నారు విశ్వక్ సేన్.

ముకేశ్ అంబానీ తనయుడు అనంత్‌ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుక ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

అనంత్‌ అంబానీ, రాధిక ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో బాలీవుడ్‌ ఇండస్ట్రీ నటులు నాటు నాటు పాటకు స్టెప్పులేశారు.

హిందీ స్టార్స్ సల్మాన్‌ఖాన్‌, షారుఖ్‌ ఖాన్‌, ఆమిర్‌ ఖాన్‌తో పాటు రామ్ చరణ్‌ కూడా నాటు నాటు పాటకు కాలు కదిపారు.

బాలీవుడ్ ఇండస్ట్రీ ఖాన్స్ తో కాలు కదిపించడం అంబానీ ఫ్యామిలీకే సాధ్యమైందని అంటున్నారు ఇది చూసిన నెటిజన్లు.