వియత్నాంలో నిఖిల్.. రాజ్ తరుణ్ చిత్రం అప్డేట్..
08 September 2023
రాజ్ తరుణ్ హీరోగా ఏఎస్ రవికుమార్ చౌదరి తెరకెక్కిస్తున్న సినిమా తిరగబడరా సామి నుంచి తాజాగా చాలా బాగుందే లిరికల్ సాంగ్ విడుదలైంది.
ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజ్ తరుణ్ సరసన మాల్వీ మల్హోత్రా కథానాయకిగా చేస్తుంది.
ఇటీవల వచ్చిన స్పై సినిమాతో నిరాశ పరిచిన యంగ్ హీరో నిఖిల్ వరసగా పాన్ ఇండియన్ సినిమాలతో వచ్చేస్తున్నారు.
అందులో భాగంగానే స్వయంభు సినిమా కోసం వియత్నాం వెళ్లారు. అక్కడే నెల రోజుల పాటు కఠినమైన ట్రైనింగ్ తీసుకోనున్నారు.
దాంతో పాటు ది ఇండియా హౌజ్ సినిమా కూడా చేస్తున్నారు నిఖిల్. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వి మెగా పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
విక్రమ్ భారీ విజయం తర్వాత వరస సినిమాలతో బిజీ అయిపోయారు లోకనాయకుడు కమల్ హాసన్. ప్రస్తుతం ఇండియన్ 2తో బిజీగా ఉన్నరు.
ఈ చిత్రం తర్వాత హెచ్ వినోద్ దర్శకత్వంలో నటించబోయే సినిమా కోసం ఐరన్ ఆర్మ్స్ ట్రైనింగ్ మొదలు పెట్టారు.
అజిత్ కుమార్ హీరోగా తెరకెక్కించిన వలిమై, తునివు లాంటి హిట్ సినిమాలతో వినోద్‌కు తమిళనాట క్రేజ్ వచ్చింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి