సెలెబ్రేషన్స్ లో మిస్ శెట్టి .. కొత్త చిత్రంతో సిద్దంగా రక్షిత్ శెట్టి..
18 September 2023
నవీన్ పొలిశెట్టి హీరోగా దర్శకుడు మహేష్ బాబు తెరకెక్కించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. ఈ చిత్రంతో దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.
గతవారం విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. విడుదలై వారం అవుతున్న తగ్గదేలే అన్నట్లుగా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.
ఇప్పటికీ దీనికి మంచి వసూళ్లే వస్తున్నాయి. తాజాగా ఈ చిత్ర సక్సెస్ సెలబ్రేషన్స్ జరిగాయి. చిత్ర యూనిట్ అంతా హాజరయ్యారు.
777 చార్లి సినిమాతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రక్షిత్ శెట్టి. ఈ చిత్రం విడుదలైన అన్ని భాషల్లో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
తాజాగా రక్షిత్ శెట్టి హీరోగా తెరకెక్కిన కన్నడ సినిమా సప్త సాగర దాచే ఎల్లో సైడ్ ఏ. హేమంత్ ఎం. రావు ఈ చిత్రానికి దర్శకుడు.
ఈ సినిమాను సప్త సాగారాలు దాటి పేరుతో సెప్టెంబర్ 22న తెలుగులో రిలీజ్ చేస్తున్నారు పీపుల్ మీడియా సంస్థ. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలైంది.
హృతిక్ శౌర్య హీరోగా నటించిన చిత్రం ‘ఓటు’. చాలా విలువైనది అనేది ట్యాగ్ లైన్. తన్వి నేగి ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్నారు.
రవి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రానిది. ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఈ చిత్రం త్వరలోనే థియేటర్స్ లో సందడి చేయనుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి