16 September 2023
విశాల్ హీరోగా ఆధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన సినిమా మార్క్ ఆంటోనీ. సెప్టెంబర్ 15న సినిమా విడుదల అయింది. ఈ వారం మార్క్ ఆంటోనీతో పాటు ఛాంగురే బంగారు రాజా, రామన్న యూత్ లాంటి సినిమాలు కూడా విడుదల అయ్యాయి.
విజయ్ దేవరకొండ మాట నిలబెట్టుకున్నారు. ఖుషి సక్సెస్ మీట్‌లో కోటి రూపాయలు 100 కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఇస్తానని చెప్పిన విజయ్.. చెప్పినట్లుగానే అందరికీ డబ్బులు ఇచ్చేసారు.
నాగ చైతన్యకు రేసింగ్ అంటే చాలా ఇష్టం. తాజాగా ఈయన హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ పేరుతో మోటర్ స్పోర్ట్ రేసింగ్ టీమ్‌ను కొనుగోలు చేసారు. ఫార్ములా 4 ఇండియన్ ఛాంపియన్ షిప్‌లో చైతూ టీం కూడా పాల్గొనబోతుంది.
సైమా అవార్డులలో లీడింగ్ పెర్ఫర్మార్ జాబితాలో 'ఆర్ఆర్ఆర్' సినిమాకు గానూ జూనియర్ ఎన్టీఆర్‌కు ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ 'దేవర' లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నాడు.
షారుఖ్ ఖాన్ హీరోగా, కోలీవుడ్ దర్శకుడు అట్లీ కుమార్ తెరకెక్కించిన 'జవాన్' సినిమా దేశవ్యాప్తంగా హిస్టోరికల్ రన్ కంటిన్యూ చేస్తోంది. గురువారం ఈ సినిమా 20 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది.
ప్రభాస్ 'సలార్' మూవీ సెప్టెంబర్ 28 నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. కొంత విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ ఇంకా మిగిలి ఉండటంతో అది పూర్తయితేనే తప్ప.. మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే అవకాశం లేదని తెలుస్తోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ సినిమాలో సీనియర్ నటి గౌతమి కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీలీల, సాక్షి వైద్య హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
రుహానీ శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ 'HER'. ఈ చిత్రం పార్ట్-1 జూలై 21న థియేటర్లలో రిలీజ్ కాగా.. గురువారం సెప్టెంబర్ 15 నుంచి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ప్రసారం అవుతోంది