కమల్‌ టూ వెంకీ.. అందరి దరి డార్క్ కాన్సెప్టులే..

10 September 2023

ఇటు బిగ్‌బాస్‌, అటు రాజకీయాలంటూ, సినిమాలకు దూరంగా జరిగిన రోజుల్లో, ఫ్లాప్‌లు తప్ప హిట్‌లు పలకరించని సమయంలో కమల్‌కి వచ్చిన హిట్‌ విక్రమ్‌.

లోకేష్‌ కనగరాజ్‌ డైరక్ట్ చేస్తున్నారన్న మాట తప్ప ఇంకే క్రేజూ లేదు రిలీజ్‌కి ముందు. కానీ ఇప్పుడు విక్రమ్‌ మూవీ ఓ బ్రాండ్‌.

లోకేష్‌ యూనివర్శ్‌లో విక్రమ్‌కి స్పెషల్‌ ప్లేస్‌ ఉంది. విక్రమ్‌ సీక్వెల్‌, రోలెక్స్ మూవీ అంటూ రకరకాల కాన్సెప్టుల కోసం జనాలు కూడా వెయిటింగ్‌.

బీస్ట్ లాంటి ఫ్లాప్‌ సినిమా తీసిన డైరక్టర్‌ నెల్సన్‌ని నమ్మి సినిమా చేయొద్దని రజనీకాంత్‌కి సలహాలు వచ్చాయట. అయినా డోంట్‌ కేర్‌ అంటూ డేరింగ్‌గా స్టెప్‌ వేశారు రజనీకాంత్‌.

సూపర్‌స్టార్‌ గట్స్ కి, సన్‌ పిక్చర్స్ మేకింగ్‌ తోడైంది. ఇంకేంటి, ఇప్పుడు ఎక్కడ చూసినా నువ్వు కావాలయ్యా అంటున్నారు జనాలు.

600 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది జైలర్‌. తెలుగులోనూ వసూళ్లు అదిరిపోయాయి. అసలు ఏమాత్రం బజ్‌ లేకుండా రిలీజ్‌ అయి బొంబాట్ చేసింది జైలర్‌.

కమల్‌నీ, రజనీని ఆదుకున్న డార్క్ కాన్సెప్టు విక్టరీ వెంకటేష్‌కి కూడా హెల్ప్ అవుతుందా? ఆయన నటిస్తున్న సైంధవ్‌ మూవీని హిట్‌ ఖాతాలో చేరుస్తుందా?

దగ్గుబాటి ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ రేపుతున్న విషయం ఇది. ఈ ఏడాది డిసెంబర్‌లో రిలీజ్‌ కి రెడీ అవుతోంది సైంధవ్‌. ప్రస్తుతం బీదర్‌ పోర్టులో షూటింగ్‌లో ఉన్నారు వెంకటేష్‌.