గేమ్ చేంజర్ నయా షెడ్యూల్.. బర్నింగ్ స్టార్ కొత్త చిత్రం..

19 September 2023

పవన్ కళ్యాణ్, సుజీత్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఓజి. ఈ చిత్ర షూటింగ్ రెండు నెలలుగా ముంబైలోనే జరుగుతుంది. అక్కడే కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించారు సుజీత్.

'జవాన్' తర్వాత తాజాగా ఓ తమిళ సినిమాకు సైన్ చేసారు నయనతార. పురాతన నాణాలతో పాటు కొత్త కరెన్సీ నోట్లు మట్టితో కప్పి ఉంచినట్లుగా డిజైన్ చేసిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది.

కొత్త సినిమాను అనౌన్స్ చేసేశాడు బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు. తమిళ స్టార్ కమెడియన్ యోగిబాబు నటించిన మండేలా చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. దీనికి 'మార్టిన్ లూథర్ కింగ్' అనే టైటిల్ నిర్ణయించారు.

ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్న అల్లు అర్జున్‌‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. త్వరలోనే లండన్‌లోని మేడమ్‌ తుస్సాడ్స్‌ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహం కొలువుదీరనుంది.

'ఝుమ్మంది నాదం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల భామ తాప్సీ. ఈమె తాజాగా ఓ లగ్జరీ కారు కొనుగోలు చేసింది. ఇక ఆ కారు ధర అక్షరాల రూ. 2.92 కోట్లు.

బిచ్చగాడు హీరో విజయ్‌ ఆంటోనీ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. విజయ్‌ ఆంటోనీ కుమార్తె మీరా ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆస్పత్రికి తరలిస్తుండగానే ఆమె మృతి చెందింది.

షారుఖ్ ఖాన్ హీరోగా దర్శకుడు అట్లీ కుమార్ తెరకెక్కించిన 'జవాన్' చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రిలీజైన 11 రోజులలోనే వరల్డ్ వైడ్‌గా 858.68 కోట్ల కలెక్షన్స్‌ను వసూలు చేసింది.

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ నటిస్తున్న గేమ్‌ చేంజర్‌ సినిమా కొత్త షెడ్యూల్ వచ్చే వారం నుంచి మొదలుకానుంది. ఈ చిత్రానికి శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు.