భగవంత్ కేసరి పూర్తి కావడంతో ప్రమోషన్స్‌తో బిజీ అయిపోయారు బాలయ్య. ప్రస్తుతం ఈయన అన్‌స్టాపబుల్ 3పై ఫోకస్ చేసారు.
ప్రభాస్ ఇండియాలో లేకపోయినా ఆయన సినిమాల షూటింగ్స్ ఆగట్లేదు. ఓ వైపు శంకరపల్లిలో నాగ్ అశ్విన్ కల్కి షూటింగ్, RFCలో సలార్ ప్యాచ్ వర్క్ జరుగుతున్నాయి. దేవర షూటింగ్ శంషాబాద్‌లోనే నడుస్తుంది.
నాగార్జున నా సామిరంగా షూటింగ్ పోచంపల్లి నుంచి అల్యూమీనియం ఫ్యాక్టరీకి షిఫ్ట్ అయింది. ఈ చిత్రం 2024 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
మహేష్ బాబు, త్రివిక్రమ్ గుంటూరు కారం షూటింగ్ రెండు వారాలుగా అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్‌లో జరగ్గా.. ఈ వారం శంకరపల్లికి మారింది.
ఇక అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ రెండు చోట్ల జరుగుతుంది.. యూనిట్ 1 సారధి స్టూడియోస్‌లో.. మరో యూనిట్ డాగ్ హౌజ్‌లో బిజీగా ఉన్నారు.
దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ సినిమా అల్యూమీనియం ఫ్యాక్టరీలో బిజీగా నడుస్తుంది.. అలాగే గోపిచంద్, శ్రీను వైట్ల సినిమా షెడ్యూలో ఇటలీలోనే రెండు వారాలుగా జరుగుతుంది.
హాయ్ నాన్న షూటింగ్ పూర్తి చేసిన నాని.. ఈ వారమే వివేక్ ఆత్రేయ సినిమాతో బిజీ అయ్యారు. ఈ చిత్ర షూటింగ్ అల్యూమీనియం ఫ్యాక్టరీలో జరుగుతుంది.