రోజుకు రెండు.. ఈ వారం నాలుగు భారీ చిత్రాలు థియేటర్లలో సందడి..
16 October 2023
అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటసింహ బాలయ్య హీరోగా తెరకెక్కిన చిత్రం ‘భగవంత్ కేసరి’. శ్రీలీల బాలయ్య కూతురిగా కనిపించనుంది. కాజల్ కథానాయక.
‘నేల కొండ భగవంత్ కేసరి.. ఈ పేరు సానా ఏళ్లు యాదుంటది’ అంటూ బాలయ్య అక్టోబర్ 19న ప్రేక్షకులను పూనకాలు తెప్పించనున్నారు.
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ విజయ్ దళపతి కాంబో మూవీ ‘లియో’. మాస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న చిత్రమిది.
లోకేష్ సినిమాటిక్ యూనివర్స్’లో భాగంగా వస్తున్న ఈ సినిమా అక్టోబర్ 19న థియేటర్స్ లో సందడి చేయనుంది.
ఇండియా మోస్ట్ వాంటెడ్ స్టువర్ట్ పురం దొంగ బయోపిక్ గా రూపొందిన చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. ఈ చిత్రంలో రవితేజ టైటిల్ పాత్రలో నటించారు.
ఈ మూవీ దసరా కానుకగా ఈ నెల 20న ప్రేక్షకులను అలరించనుంది. రవితేజ తొలి పాన్ ఇండియా చిత్రమిది. రేణు దేశాయ్ కీలక పాత్రలో నటించారు.
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్, కృతిసనన్ జోడిగా తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా ‘గణపథ్: ఎ హీరో ఈజ్ బోర్న్’.
ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా అక్టోబర్ 20న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి