40 ప్లస్‌లోనూ ఇంత అందంగానా? త్రిష బ్యూటీ సీక్రెట్ ఇదే

21 January 2025

Basha Shek

40 ప్లస్ లోనూ హీరోయిన్ గా రాణిస్తోంది సౌతిండియన్ బ్యూటీ క్వీన్ త్రిష. చేతినిండా ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉంటోంది.

ఓవైపు చిరంజీవి, అజిత్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ రోల్స్ చేస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ మూవీస్ లో నటిస్తోందీ అందాల తార.

సినిమాలు చేస్తూనే, వెబ్ సిరీసుల్లోనూ నటిస్తోందీ బ్యూట. 40 ప్లస్ లోనూ త్రిష ఇంత అందంగా కనిపించేందుకు కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి.

త్రిష ఉదయం ఒక గంటపాటు వ్యాయామం చేస్తుంది. కార్డియోతో పాటుగా మరికొన్ని వ్యాయామాలను రెగ్యులర్ గా చేస్తుందట

సాయంత్రం 6.30 గంటలకే డిన్నర్ పూర్తి చేస్తుందట. ఆ  తర్వాత పండ్లు కూడా తినదట. అలాగే తిన్న వెంటనే నీళ్లు తాగదట.

త్రిష పండ్లు, కూరగాయలను పుష్కలంగా తింటుందట. అంతేకాదు క్రమం తప్పకుండా యోగా చేసే అలవాటు కూడా ఉందట.

స్విమ్మింగ్, సైక్లింగ్ త్రిషకు ఎంతో ఇష్టమైన యాక్టివిటీస్.  చిన్నప్పటి నుంచి కూడా వీటిని రోజూ చేసుకుంటూ వస్తోందట ఈ  బ్యూటీ క్వీన్.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరతో పాటు అజిత్ పట్టుదల సినిమాల్లో మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది త్రిష.