03 September 2023
బిగ్ బాస్.. ఏడో సీజన్‌లో మొదటి కంటెస్టెంట్‌గా ప్రముఖ సీరియల్, సినిమా నటి ప్రియాంక జైన్ బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టింది. బలగం సినిమాలోని ‘పొట్టి పిల్ల పొట్టి పిల్ల’ సాంగ్‌కి స్టెప్పులేస్తూ ఎంట్రీ ఇస్తూ.. హోస్ట్ నాగార్జునతో కలిసి స్టెప్పులేశారు.
బిగ్ బాస్ రెండో కంటెస్టెంటుగా ప్రముఖ టాలీవుడ్ నటుడు శివాజీ అడుగుపెట్టి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. శివాజీ మొదట చిన్న చిన్న పాత్రలు పోషించి తర్వాత పలు సినిమాల్లో హీరోగా నటించిన విషయం తెలిసిందే.
మూడో కంటెస్టెంటుగా టాలీవుడ్ సింగర్ దామిని బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టారు. బాహుబలి సినిమాలో పచ్చబొట్టేసిన పాటతో పాపులర్ అయిన దామిని.. గాడ్ ఫాదర్, బ్రో సినిమాతో పాటు పలు మూవీలకు అద్భుతమైన పాటలు పాడింది.
బిగ్‌బాస్ తెలుగులోకి నాలుగో కంటెస్టెంట్ గా ఎవరూ ఊహించని విధంగా ప్రిన్స్ యావర్ ఎంట్రీ ఇచ్చాడు. సాహోలోని బ్యాడ్ బాయ్ పాటతో సిక్స్‌ప్యాక్ బాడీతో ఎంట్రీ ఇచ్చిన యావర్ ను.. నాగార్జున నీపేరు యావరా.. ఓవరా అంటూ పేర్కొనడం గమనార్హం..
బిగ్ బాస్ ఐదో కంటెస్టెంటుగా శుభ శ్రీ అడుగు పెట్టింది. లాయర్, నటిగా రాణిస్తున్న శుభశ్రీ.. శుభశ్రీ సమ్మోహనుడా పాటకు హాట్ హాట్‌గా స్టెప్పులేస్తూ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది..