07 June 2024

ఎట్టకేలకు హిట్టుకొట్టిన బేబమ్మ.. కృతి మళ్లీ జోరు పెంచడం ఖాయమా..?

Rajitha Chanti

Pic credit - Instagram

ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమయ్యింది హీరోయిన్ కృతి శెట్టి. పస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. 

ఫస్ట్ మూవీతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఉప్పెన విడుదలకు ముందే సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. 

ముఖ్యంగా నీ కన్ను నీలి సముద్రం.. అనే లిరికల్ వీడియోతో కృతి శెట్టి ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. దీంతో ఆఫర్స్ క్యూ కట్టాయి. 

ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగర్రాజు చిత్రాలతో హిట్స్ అందుకుంటూ జోష్ మీదున్న ఈ  బ్యూటీకి మెల్లగా డిజాస్టర్స్ పలకరించాయి. 

 దీంతో నెమ్మదిగా తెలుగులో సినిమాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళంలో ఒక్కో సినిమాలో నటిస్తుంది కృతి శెట్టి. 

తాజాగా యంగ్ హీరో శర్వానంద్ సరసన మనమే చిత్రంలో నటించింది. జూన్ 7న విడుదలైన ఈ మూవీ సమ్మర్ బ్లాక్ బస్టర్‏గా నిలిచింది. 

చాలా కాలం తర్వాత మనమే సినిమాతో సూపర్ హిట్ అందుకుంది కృతి. దీంతో తెలుగులో ఈ బ్యూటీకి మరిన్ని ఆఫర్స్ రావడం ఖాయమే. 

మనమే సూపర్ హిట్ కావడం కృతికి హెల్ప్ అయ్యేలాగే చూపిస్తుంది. అలాగే ఈ ముద్దుగుమ్మ కెరీర్ మళ్లీ పట్టాలెక్కనుందని టాక్ నడిస్తుంది.